Saturday, November 23, 2024

మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే కొత్త ప్రభుత్వానికి సహకరిస్తాం

- Advertisement -
- Advertisement -

అన్ని పోటీ పరీక్షలను ఉర్దూలో నిర్వహించాలి
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ

మనతెలంగాణ/హైదరాబాద్ : మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే కొత్త ప్రభుత్వానికి సహకరిస్తామని ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి తాము మద్దతిచ్చామని గుర్తు చేశారు. ఆయన ఆదరణ, ప్రేమ వల్ల తాము కాంగ్రెస్‌కు దగ్గరగా ఉన్నామని తెలిపారు. తాము ఏమైనా బాధలు చెప్పుకున్నా దానిని ఆయన ఆదరించి పరిష్కరించే వారు కాబట్టే తాము రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉన్నామన్నారు.ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ఆర్‌తో ఎంతో కృషి చేశారన్నారు.

రాజకీయాలు ఎన్నికల వరకే అని, గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పని చేయాలని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. కొత్త ప్రభుత్వం పాతబస్తీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదన్నారు. డిఎస్‌సి మాత్రమే కాదు.. ఇతర పరీక్షలు ఉర్దూలో నిర్వహించాలన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే.. గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పనిచేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు.

డిఎస్‌సి నోటిఫికేషన్ రెండు సార్లు ఇవ్వాలి
ఉర్దూను డిఎస్‌సిలో చేర్చాలని ఎంఐఎం అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. డిఎస్‌సిలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు మాత్రమే ఉంటున్నారని, అందులో ఉర్దూని కూడా చేర్చాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఉర్దూ రాదని, చట్టం ఎస్‌సి, ఎస్‌టిలకు పోస్టులు ఇవ్వమంటే డిఎస్‌సి నోటిఫికేషన్ రెండు సార్లు ఇవ్వాలని కోరారు. డిఎస్‌సి నోటిఫికేషన్ రెండు సార్లు ఇస్తే..ఉర్దూకు సంబంధించి భర్తీ కాని ఎస్‌సి,ఎస్‌టి, బిసి పోస్టులు భర్తీ అవుతాయని అన్నారు. పదోన్నతులు, డిపార్ట్‌మెంటల్ పరీక్షలతో సహా అన్ని పోటీలలో ఉర్దూను చేర్చాలని కోరారు. ఇది చాలా అవసరమని.. కానీ ఈ పని జరగడం లేదని పేర్కొన్నారు. అన్ని పోటీ పరీక్షలను ఉర్దూలో నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారని అన్నారు. బిఆర్‌ఎస్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ఇస్తుందా అని అడిగారు. కాంగ్రెస్ కులగణన చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నంను స్వాగతిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News