Saturday, January 11, 2025

భారత్‌లో వజ్రాయుధం

- Advertisement -
- Advertisement -

సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రపంచంలోనే అత్యంత భారీ ఆఫీస్ కాంప్లెక్స్‌గా రికార్డు నా ఇన్నింగ్స్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా
భారత్ అవతరించబోతోంది నవ భారత శక్తి, దృఢ సంకల్పానికి ఈ భవనం ఓ గుర్తు: నరేంద్ర మోడీ శుద్ధిచేసిన,
ముడి వజ్రాల వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రంగా అవతరించనున్న గుజరాత్‌లోని సూరత్ పట్టణం

సూరత్: ప్రధానమంత్రిగా తాను మూడోసారి ఉండగానే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివారం ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ అయిన సూరత్ డైమండ్ బోర్స్( ఎస్‌డిబి)ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూరత్ వజ్రాల పరిశ్ర మ దాదాపు 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, ఈ కొ త్త భవనం ప్రారంభమయిన తర్వాత మరో లక్షన్నర మంది కి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. ‘ సూరత్ కీర్తి కిరీటంలో మరో  వజ్రం చేరింది. అది చిన్న వజ్రం కాదు, ప్రపంచంలోనే ఉత్తమమైనది. ఈ వజ్రం జిలుగుల ముందు ప్రపంచంలోని అతి పెద్ద భవనాలు సైతం వెలవెలపోతాయి. ప్ర పంచంలో ఎప్పుడు ఈ బిల్డింగ్ గురించి మాట్లాడినా సూర త్, భారత్ ప్రస్తావన వచ్చి తీరుతుంది’ అని ప్రధాని అ న్నారు.

నవ భారత శక్తి, దృఢ సంకల్పానికి ఈ భవనం ఓ గుర్తని కూడా ఆయన అన్నారు. గత పదేళ్ల కాలంలో భారత్ పదో స్థానంనుంచి అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారి న విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మోడీ తన మూడో ఇన్నింగ్స్‌లో భారత్ ప్రపంచంలోని తొలి మూడు ఆ ర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని హామీ ఇస్తున్నాడు’ ఆయన చెప్పారు. వజ్రాలు, వజ్రాభరణాల అంతర్జాతీయ వ్యాపారానికి ఎస్‌డిబి కేంద్రంగా నిలవనుంది.అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ భవనాల సముదాయాన్ని సూరత్ సమీపంలోని ఖాజోడ్ గ్రామంలో నిర్మించారు. శుద్ధి చేసిన, ముడి వజ్రాల వ్యాపారానికి ఇది అంతర్జాతీయ కేంద్రంగా మారనుంది.

అలాగే ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్ కూడా ఈ భవనంలోనే ఉంటుంది. ఆభరణాల రిటైల్ వ్యాపారులు తమ విక్రయ కేంద్రాలను దీనిలోనే ఏర్పాటు చేసుకోవచ్చు.అంతర్జాతీయ బ్యాంకింగ్, సురక్షిత లాకర్ల సదుపాయం కూడా ఉంటుంది. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న పలువురు వజ్రాల వ్యాపారులు ఇప్పటికే దీనిలో కార్యాలయాలను దక్కించుకున్నారు. వేలం పద్ధతిలో ఎస్‌డిబి మేనేజ్‌మెంట్ వాటిని వారికి కేటాయించింది. దీంట్లో సుమారుగా 4,500 కార్యాలయాలున్నాయి.‘ డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కైంటైల్ సిటీ’సిటీలో భాగంగానే దీన్ని నిర్మించారు.2015 ఫిబ్రవరిలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ దీనికి భూమిపూజ చేశారు. డ్రీమ్ సిటీలో మొత్తం 35.54 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎస్‌డిబిని నిర్మించారు.

ఈ ఎస్‌డిబిలో మొత్తం తొమ్మిది భవనాలున్నాయి. ఒక్కో దానిలో 15 అంతస్థులునిర్మించారు. ఈ సముదాయాల్లో 300 చదరపు అడుగునుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాలున్నాయి. దాదాపు రూ.3,200 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. పూర్తి హరిత భవనంగా తీర్చిదిద్దారు. నాలుగు వేల సిసి కెమెరాలతో పాటు స్మార్ట్ గేట్లతో భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సూరత్ వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలను సానపెట్టడం, పాలిష్ చేయడం వంటి 90 శాతం కార్యకలాపాలు ఇక్కడే జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎస్‌డిబితో వజ్రాల వ్యాపారం మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కొత్త టెర్మినల్ భవనం ప్రారంభం

తన పర్యటనలో భాగంగా ప్రధాని సూరత్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. దీంతో సూరత్ విమానాశ్రయం అంతర్జాతీ విమానాశ్రయం హోదా పొందనుంది. దీంతో వజ్రాల వ్యాపారమే కాకుండా జవుళి, పర్యాటకం, విద్య తదితర అనేక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News