Saturday, December 21, 2024

తన రికార్డులను తానే తిరగరాసుకుంటూ..

- Advertisement -
- Advertisement -

కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘డంకీ’. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌తో డైరెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారని స్పష్టమైంది. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘డంకీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

మనదేశంలోనే కాదు, ఓవర్ సీస్‌లోనూ డంకీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో టికెట్స్ చకచకా బుక్ అవుతున్నాయి. ఈ ఏడాది షారూక్ వర్సెస్ షారూక్ అనేలా తన రికార్డులను తనే తిరగ రాసుకుంటున్నారు కింగ్ ఖాన్. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్‌ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంట్‌ట్రైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిలమ్స్ బ్యానర్స్‌పై సమర్పణలో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News