- Advertisement -
నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న సరకుల ధరతో సామాన్యుడు తల్లిడిల్లిపోతున్నాడు. బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు ధరలు ఏడాది కాలంలో బాగా పెరిగిపోయాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో కందిపప్పు ధర 105 రూపాయలు ఉంటే, ఇప్పుడు 159 రూపాయలకు చేరింది. అంటే 50 శాతం పెరిగిందన్నమాట. అలాగే మినపపప్పు ధర కూడా కొండెక్కింది. గత ఏడాది డిసెంబర్ లో 114 రూపాయలుంటే, ఇప్పుడు 126 రూపాయలకు చేరింది. సన్న బియ్యం ధరలో 6 శాతం పెరుగుదల ఉంది. కిలో ఉల్లిగడ్డల రేటు గత డిసెంబర్లో 27 రూపాయలుంటే, ఇప్పుడు ఆ ధర 47 రూపాయలకు పెరిగింది. పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిగిన సమీక్షలో నిత్యావసర సరకుల పెరుగుదల బయటపడింది.
- Advertisement -