Saturday, December 21, 2024

‘మాంసం, చేపల విక్రయంపై ఆంక్షలు దారుణం’

- Advertisement -
- Advertisement -

మాంసం, చేపలను బహిరంగంగా విక్రయించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో మాంసాన్ని, చేపలను విక్రయించకుండా అడ్డుకోవడంవల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని విమర్శిస్తున్నాయి.

మధ్యప్రదేశ్ లో బీజేపి కొత్తగా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా మాంసం, చేపలు, గుడ్లను బహిరంగంగా విక్రయించకూడదని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, వాటిని తూచ తప్పకుండా పాటించవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అన్నారు.  మాంసం, చేపలు, గుడ్లను బహిరంగంగా విక్రయించకుండా పోలీసులు, ఆహార శాఖాధికారులు సంయుక్తంగా ప్రచారం చేపడతారని ఆయన చెప్పారు.

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ కల్పనకు పూనుకోవలసిన ప్రభుత్వం, మాంసం, గుడ్లు అమ్ముకునేవారి పొట్టకొడుతోందని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. ప్రభుత్వ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News