Sunday, April 6, 2025

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి….

- Advertisement -
- Advertisement -

స్నేహితులే హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ….

సిద్దిపేట: ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సిద్దిపేట అర్బన్ మండలంలో జరిగింది. తడకపల్లి గ్రామానికి చెందిన దండు శ్రీనివాస్ అనే వ్యక్తి పేకాట ఆడుతూ జల్సాలు చేసేవాడు. శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి పేకాట ఆడుతుండగా వారి మధ్యలో గొడవ జరగడంతో అతడి స్నేహితులే హత్య చేసి ఉంటారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News