Friday, November 22, 2024

పాక్‌కు బిగ్ షాక్!

- Advertisement -
- Advertisement -

స్లో ఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో కోత

దుబాయ్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డంటూ ఉంది పాకిస్థాన్ జట్టు పరిస్థితి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు 369 పరుగుల తేడాతో ఘోరపరభావాన్ని చవిచూసిన పాక్‌కు మరో షాక్ తగిలింది. సిరీస్‌లో 0-1తో వెనకబడిన పాక్ జట్టుకు స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోత విధించింది ఐసిసి. నిర్ణీత సమయానికి 2 ఓవర్లు తక్కువగా వేసినట్లు నిర్ధారించిన మ్యాచ్ రిఫరీ పాక్ ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత విధిస్తూ కోరఢా ఝులిపించాడు. ఇక ఈ ఓటమితో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పాక్ ర్యాంకు రెండో స్థానానికి పడిపోయింది. అంతేకాదు స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్ రేట్ 66.67 నుంచి 61.11కు కుదించారు. దీంతో రెండో స్థానంలో ఉన్న భారత్ జట్టు 66.67 రేట్‌తో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News