- Advertisement -
బెంగళూరు: అన్నంలోకి పచ్చడి కావాలని ఇంట్లోకి వచ్చి ఓ మహిళ చెంపను కొరికి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన సంఘటన కర్నాటక రాష్ట్రం దావణగెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డిహెచ్ అంజప్ప అనే వ్యక్తి అన్నంలోకి పచ్చడి కావాలని అడిగాడు. ఓ మహిళ పచ్చడి వేస్తుండగా చెప్పకొరికి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో ఘటనా స్థలం నుంచి అతడు పారిపోయాడు. దావణగెరె ప్రాంతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీస్ స్టేసన్ ఎదులు మహిళలు ధర్నాకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పి ఉమా ప్రశాంత్ ఆ గ్రామానికి వచ్చి బాధితురాలిని పరామర్శించారు.
- Advertisement -