Friday, December 20, 2024

అయ్యప్ప స్వామి భక్తులపై లాఠీఛార్జ్

- Advertisement -
- Advertisement -

కేరళ: శబరిమలకు అయ్యప్ప స్వామి భక్తులు తండోపతండాలు తరలివచ్చారు. శబరికొండ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. శబరిపీఠం నుంచి మొదలు పెడితే పంబా వరకు క్యూలైన్లు నిండిపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ప్రతీ రోజు దాదాపుగా 80 నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుండడంతో ఇసుక వేసిన రాలనంతగా కనిపిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

కేరళ ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించలేదని అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు. కేరళ ప్రభుత్వం 16 వేల మంది పోలీసులు నియమించానని చెబుతున్నప్పటికి ఎక్కడ పోలీసులు కనిపించడం లేదని భక్తులు వాపోతున్నారు. పంబా నుంచి శబరి 650 మంది పోలీసులు ఉన్నట్టు సమాచారం. పంబా పార్కింగ్ స్థలం కేటాయించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 16 నుంచి జనవరి 25 వరకు భక్తులు శబరికి తండోపతండాలుగా తరలివస్తారు. ఈ రెండు నెలల కేరళ ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తున్నప్పటి భక్తులకు మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదని అయ్యప్పస్వాములు మండిపడుతున్నారు. ఆర్‌టిసి బస్సులు లేక భక్తులు ఇబ్బందిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News