Friday, December 20, 2024

చైనాలో భారీ భూకంపం

- Advertisement -
- Advertisement -

118 మంది మృతి: 579 మందికిగాయాలు
భూకంప తీవ్రత 6.2గా నమోదు

బీజింగ్/జిషీషన్: వాయువ్య చైనాలో మారుమూల పర్వత ప్రాంతాలలో సోమవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించి 118 మంది మరణించగా మరో 500 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు స్థానిక భూకంప సహాయ ప్రధాన కార్యాలయం మంగళవారం తెలిపింది. సోమవారం అర్ధరాత్రి 11.59 గంటల ప్రాంతంలో గన్సు, క్వింఘై ప్రావిన్సులలో భారీ భూకంపం సంభవించినట్లు చైనా భూకంప అధ్యయన కేంద్రం(సిఇఎన్‌సి) తెలిపింది. భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. టిబెట్ హిమాలయా ప్రాంతానికి పక్కనే ఉన్న క్వింఘై ప్రావిన్సులో తరచు భూకంపాలు చోటుచేసుకుంటాయి.

కాగా, కొద్ది గంటల తర్వాత పొరుగున జింజియాంగ్ ఉయిగుర్ స్వతంత్ర ప్రాంతంలో కూడా మరో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 9.46 గంటల ప్రాంతంలో రెండవ భూకంపం సంభవించినట్లు సిఇఎన్‌సి తెలిపింది. గన్సు, క్వింఘై కూడా ప్రకంపనలకు గురయ్యాయి. గన్సులో 105 మంది మరణించగా క్వింఘైలో 13 మంది మరణించినట్లు అధికారిక వార్తలు తెలిపాయి. భూకంప తాకిడికి గురైన ప్రాంతాలలో మత్తం 579 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూకంపానికి 6,381 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

కొన్ని గ్నామీణ రోడ్లు ధ్వంసమయ్యాయని, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వారు చెప్పారు. అనేక గ్రామాలకు విద్యుత్, మంచినీటి సరఫరా నిలిచిపోయినట్లు వారు తెలిపారు. ఎల్లో రివర్‌పై ఉన్న వంతెన భూకంపం కారణంగా బీటలు వారిందని రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. సాధారణంగా చలి తీవ్రంగా ఉండే జిషిషన్ ప్రాంతంలో మంగళవారం ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీలకు పడిపోయిందని వాతావరణ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News