Monday, December 23, 2024

జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షాలకు అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావా విచారణ అర్హతను సవాలు చేస్తూ వచ్చిన మొత్తం ఐదు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

1991 నాటి ప్రార్థనా స్థలాల ( ప్రత్యేక నిబంధనలు) చట్టం ప్రకారం ఆగస్టు 15, 1947 కు ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉనికిలో ఉన్నట్టుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు వాదనలు వినిపించాయి. అయితే మసీదు ప్రాంగణంలో ఉన్న దేవతా మూర్తులను ఆరాధించడానికి అనుమతించాల్సిందిగా కొంతమంది మహిళలు ఇటీవల కోర్టును ఆశ్రయించగా, దీనిపై ఇటీవల విచారణ జరిపిన వారణాసి కోర్టు … మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది.

అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూ ఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్ , ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పురావస్తుశాఖ ఇక్కడ సర్వే నిర్వహించింది. ఆ నివేదికను కూడా ఇటీవల కోర్టుకు సమర్పించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News