Monday, December 23, 2024

ఉమ్మడి ఆస్తుల విభజనపై దృష్టి సారించండి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్ నిర్మాణం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళ వారం ఆయన సమీక్ష నిర్వహించారు.

భవనం మొత్తం విస్తీర్ణం ఎంత.? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను సిఎం అడిగి తెలుసుకున్నారు.ఉమ్మడిగా 19.781ఎకరాల భూమి ఉందని అధికారులు సిఎంతో తెలిపారు. ఇం దులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3. 359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరా ల్లో పటౌడి హౌ స్ ఉన్నాయని అధికారులు సిఎంకు వివరించారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సిఎం వారిని ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8. 245 ఎకరాల భూమి, ఎపికి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తిలో) వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.

ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సిఎం ఆరా తీశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాలు కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సిఎంతో తెలిపారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సం దర్భంగా సిఎం వారితో అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్‌ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలుసూచనలు ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News