Monday, December 23, 2024

హరీశ్ రావును.. తండ్రీకొడుకులు వాడుకుంటున్నారు: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఎంత బాగా పనిచేసిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వరని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని గంటలు సమయం ఇచ్చినా హరీష్ రావుకు సరిపోలేదు.. అబద్ధం చెప్పడంలో హరీశ్‌కు మేనమామ సాలు వచ్చిందన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వరని హరీశ్ రావు అన్నారని.. తనకు మంత్రి పదవి ఇవ్వాలనా వద్దా అనేది అదిష్టానం చూసుకుంటుందన్నారు. కానీ, హరీశ్ రావును..తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లు వాడుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ తర్వాత కెటిఆర్ సీఎం అవుతాడు కాని.. హరీశ్ రావు కాడన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. దీంతో సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News