- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అసెంబ్లీలో బుధవారం వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఇరిగేషన్ లో అవకతవకలు జరిగాయని.. తప్పుచేసిన వారిని వదిలేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ..
మేడిగడ్డ దాదాపు ఐదు ఫీట్లు కుంగిపోయిందని చెప్పారు. అక్టోబర్ 21న పిల్లర్లు కుంగితే.. కేసీఆర్ ఇప్పటివరకూ మాట్లాడలేదని దుయ్యబట్టారు.
బ్యారేజీ కుంగడంపై బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశీలించలేదని.. దర్యాప్తుకు కూడా ఆదేశించలేదని ఫైరయ్యారు. సీఐజీ రిపోర్టు ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 40వేల ఎకరాలకే నీరు అందుతోందని.. దాదాపు రూ.లక్ష కోట్ల నిధులతో కట్టిన కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టు శూన్యమని తెలిపారు. మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి చెప్పారు.
- Advertisement -