- Advertisement -
‘జూలియట్.. ఎన్నేళ్ళు అయ్యింది మనం కలిసి’ అని అడవి శేష్ అడుగగా.. గాయపడిన శృతి హాసన్ చీరకట్టులో తుపాకీ గురిపెట్టింది. ఈ సీన్ చూసేందుకు అదిరిపోంది. అడవి శేష్, శృతి హాసన్ కాంబినేషన్ లో తెలుగు, హిందీ భాషల్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీకి ‘డెకాయిట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఒక ప్రేమ కథ అని క్యాప్షన్ కూడా పెట్టారు. కొద్దిసేపటిక్రితం ఈ సినిమా టైటిట్ టీజర్ ను విడుదల చేశారు.
ఇందులో భారీ యాక్షన్ సీన్ జరిగిన తర్వాత అడవి శేష్, శృతి హాసన్ లు ఒకరిని ఒకరు చంపేందుకు తుపాకులు గురిపెట్టడం కనిపిస్తుంది. ఈ టీజర్ లో వీరిద్దరి మధ్య సంభాషణను బట్టి చూస్తే.. గతంలో ప్రేమికులుగా ఉండి..చంపుకునేంత శత్రువులుగా మారినట్లు అర్థమవుతోంది. సరికొత్త జోనర్ తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఆసక్తిగా రేకిస్తుంది. టీజర్ మూవీపై అంచనాలు పెంచేసింది.
- Advertisement -