Wednesday, January 22, 2025

అప్పుల కుప్ప

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అప్పుల కుప్పలో కూరుకుపోయింది. పదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మిగులు బడ్జెట్ నిధులతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ పదేళ్లలో భారీగా అప్పులు చేసి రుణభారాన్ని పదింతలు పెంచివేసింది. రాష్ట్ర శాసనసభ సమవేశాల్లో భాగంగా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిపై స్వేత పత్రం విడుదల చేసింది. రాష్ట్రం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 2014-15 నాటికి రాష్ట్రం రూ. 72,658 కోట్లుగా ఉందని తెలిపింది. 2014-22 మధ్య సగటున 24.5 శాతం అప్పులు పెరిగినట్టుగా ప్రభుత్వం వివరించింది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లుందని పెరిగింది. 2015-16 లో రుణ, జీఎస్‌డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. 2014-23 మధ్య బడ్జెట్ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉందని ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణ భారం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.

రెవిన్యూ రాబడిలో 34 శాతానికి రుణ చెల్లింపుల భారం పెరిగిందని ప్రభుత్వం వివరించింది.రెవిన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం పెరిగిందని తెలిపింది. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 2022 నాటికి అప్పుల రాష్ట్రంగా మారిందని ప్రభుత్వం తెలిపింది.బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిందని ప్రభుత్వం వివరించింది. ఆర్ధిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అన్ని శాఖల నుండి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకు వివరించాలనే ఉద్దేశ్యంతో శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిపై స్వేతపత్రం విడుదలచేసింది. రాష్ట్రం అప్పులు మొత్తం రూ.6,71,757కోట్లుగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి తెలంగాణ ఏర్పడేదాక గడిచిన 57 ఏళ్లలో తెలంగాణ ప్రాంత అభివృద్దికి ప్రభుత్వంవ మొత్తం 4.98 లక్షల కోట్లు వ్యయం చేసిందని తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్లలోనే రుణభారం పదిరెట్లు పెరిగిందని వివరించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వివిధ మార్గాల చేరుతున్న నిధుల రాబడిలో రుణాల చెల్లింపుల భారం 34శాతానికి చేరిందని వెల్లడించింది. ప్రభుత్వ రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీత భత్యాలకింద 35శాతం వ్యయం చేయాల్సివస్తోందని తెలిపింది. రోజూ వేస్ అండ్ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందని విచారం వెలిబుచ్చింది. 202223 లో రూ.3,30,726కోట్లు బడ్జెట్‌లో కేటాయించి ఆర్ధిక సంవత్సరం ముగిసే సరికి కేవలం రూ.1,82,998కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడించింది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల్లో ఇది 79.3శాతం మాత్రమే అని వివరించింది. దేశంలోని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం నిధుల వ్యయంలో చివరిస్థానంలో నిలవటం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News