Thursday, January 9, 2025

టాప్ 10లో రెండు భారతీయ రెస్టారెంట్లు

- Advertisement -
- Advertisement -

లండన్ : భారతీయ వంటకాల రుచులు తరాల నుంచి జగద్విదితమే . దేశానికి చెందిర రెండు ప్రఖ్యాత రెస్టారెంట్లు పారాగాన్, ఠండే కబాబీ ప్రపంచ దిగ్గజ రెస్టారెంట్ల జాబితాలో టాప్ 10లో చోటుచేసుకున్నాయి. వారెవ్వా అన్పించుకున్నాయి. ఏడాది ముగిసే దశలో రుచికరమైన ఆహారం అందించే రెస్టారెంట్లను ఎంచుకుని జాబితాను రూపొందించడం ఆనవాయితీగా ఉంది. 150 రెస్టారెంట్ల పేర్లతో ఈ జాబితా వెలువడింది. ఇందులో కేరళలోని కొజికోడ్‌లో ఉన్న పారాగాన్, లక్నోలోని ఠండే కబాబీ ఈ వరుసలో ప్రముఖ పది రెస్టారెంట్లలో స్థానం పొందగా ఇందులో పారాగాన్ 5, ఠండే కబాబీ 6వ స్థానంలో నిలిచాయి. ఈ దిగ్గజ రెస్టారెంట్ల జాబితాను, పేర్లను వాటి విశేషాలను టేస్ట్ అట్లాస్ 2023 గడిచిపోతున్న దశలో వెలువరించింది. ఈ రెండూ భోజనశాలలు చాలా ఏళ్లుగా తమ ప్రాంతపు రుచులపరంపరను చాటుకుంటూ వస్తున్నాయని టేస్ట్ అట్లాస్ కొనియాడింది. పారాగాన్ రెస్టారెంట్‌లో బిర్యానీ వంటకం ఆకట్టుకొంటోంది. పైగా స్థానిక మలయాళీ సుగంధద్రవ్యాలు, మాల్‌మసాలాలతో ఈ మాంసాహార, శాఖాహార బిర్యానీ ఇక్కడికి వచ్చే వారిని అలరిస్తోంది.

వెళ్లలేనివారిని రారమ్మని ఊరిస్తోంది. 1939లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక లక్నోలో వెలిసిన ఠండే కబాబ్ భారతదేశపు అత్యంత ప్రాచీన వంటకాలకు , ప్రత్యేకించి మెఘలాయి కబాబ్‌లు, మటన్ చికెన్ వంటలకు పెట్టింది పేరుగా మారింది. 1905లో ఈ రెస్టారెంట్ ఆరంభం అయింది. తరాలుగా ఎందరికో పసందైన విందువేదికగా సాగుతోంది. పలువురిని ఆకట్టుకునే భోజనశాలగా తన నవాబు రాజరికాన్ని ఈ దిశలో చలాయిస్తోంది. దేశం, ఖండం, ఖండాతరాల్లో పలు దిక్కులా తనకే సొంతమైన రుచిని సంతరించుకుని తనదైన సంతకంతో వెలుగొందుతోంది. ఇక టాప్ రెస్టారెంట్ల వరుసలో తొలిస్థానం ఆస్ట్రియాలోని వియన్నాలో 1905లోనే నెలకొల్పిన ఫిగ్‌ముల్లెర్ నెంబరు 1 స్థానంలో నిలచింది తరువాతి రెండో స్థానంలో నెప్లెస్‌లోని ఎల్ అంటికా పిజెరియా డ మిషెలీ మెరిసింది. ఇక జాబితాలో బెంగళూరులోని మావలి టిఫిన్స్ రూమ్స్ 32వ స్థానంలో నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News