Saturday, December 21, 2024

పల్లవి ప్రశాంత్‌ను చంచల్ గూడ జైలుకు తరలింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వంసం కేసులో బిగ్ బాస్ – 7 విజేత పల్లవి ప్రశాంత్‌, అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్టు సమాచారం. దాడికి పాల్పడిన మరి కొందరును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గీతూరాయల్ తో కూడా కొందరు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Pallavi Prashanth arrested

17న బిగ్‌బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు మరో గేటు నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. అప్పటికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతడి తమ్ముడు రెండు కార్లను తీసుకరావడంతో పోలీసులు చెప్పిన కూడా వినిపించుకోకుండా ర్యాలీకి వెళ్లడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోవాలని ప్రశాంత్‌ను పోలీసులు కోరారు. కానీ ప్రశాంత్ వినకుండా ర్యాలీ చేపట్టడంతో గొడవలు జరిగాయి. ప్రశాంత్ అభిమానులు రెండు పోలీస్ వాహనాలతో ఐదు ఆర్‌టిసి బస్సులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ప్రశాంత్ ఎ1, ప్రశాంత్ తమ్ముడు రాజును పోలీసులు ఎ2గా చేర్చారు. అద్దె కార్ల డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కేసులు నమోదయ్యాయి.

Pallavi Prashanth arrested

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News