అమరావతి: వివాహం జరిగిన వారం రోజులకే నవ దంపతులు గోదావరిలో దూకారు. వధువు గల్లంతు కాగా వరుడి ఈదుకుంటూ బయటకు వచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. డిసెంబర్ 15న శివరామకృష్ణతో సత్యవాణికి(19) పెళ్లి జరిగింది. మంగళవారం రాత్రి నవ దంపతులు సినిమాకు బయలుదేరారు. గోదావరి నదిపై సిద్ధాంతం వంతెన వద్దకు రాగానే నవ దంపతులు గోదావరిలో దూకారు. వధువు గల్లంతు కాగా వరుడు ఈదుకుంటూ బయటకు వచ్చాడు.
శివ కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. శివను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిసతున్నారు. వరుడు నాటకమాడుతున్నాడని వధువు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సత్యవాణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను నదిలోకి తోసిసి ఇప్పుడు నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. అతడు ఈదుకొచ్చిన చోట చెప్పులు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.