- Advertisement -
కరీంనగర్ : అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విషాదకర సంఘటన కరీంనగర్ రూరల్ మండలం నగునూర్‌లో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నగునూర్ లో తెలంగాణ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సృజన అనే విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతుంది. బుధవారం రాత్రి హాస్టల్లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం హాస్టల్ సిబ్బంది చూసి పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి స్వస్థలం మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామం. సృజన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సృజన ఆత్మహత్యకుగల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -