న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు, నేతలు తమ ఉపన్యాసాల్లో దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మూగ, పాగల్, సిర్పిరా, అంధ , గుడ్డి, చెవిటి , కుంటి, వంటి పదాలు నేతలు వాడకుండా ఉండాలని ఈసీ సూచించింది.
ఇది అవమానకరమైన భాష కాబట్టి అన్ని పార్టీలు ఈ విషయంలో సహకరించి, తమ నేతలకు కూడా తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది. రాజకీయ ప్రసంగాల్లో దివ్యాంగులకు న్యాయం, గౌరవం కల్పించాలని సూచించింది. ప్రసంగాలతోపాటు సోషల్ మీడియా పోస్టులు, పత్రికా ప్రకటనలు, ప్రచార సామగ్రిలో వికలాంగుల పట్ల అసహ్యకరమైన లేదా వివక్షతతో కూడిన భాషా పరంగా, ఉన్న పదాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి రాజకీయ పార్టీ అంతర్గత సమీక్ష ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాలని ఈసీ సూచించింది. అన్ని రాజకీయ పార్టీలు దివ్యాంగులను గౌరవిస్తున్నట్టు తమ పార్టీ వెబ్‌సైట్‌లో ప్రధానంగా ప్రచురించాలని ఈసీ సూచించింది.