Friday, October 18, 2024

రాజకీయ నేతలు ఉపన్యాసాల్లో అవమానకర భాష మాట్లాడొద్దు

- Advertisement -
- Advertisement -

మూగ, గుడ్డి, చెవిటి, కుంటి పదాలు నిషేధించాల్సిన అవసరం ఉంది: కేంద్ర ఎన్నికల సంఘం

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ రాజకీయ ప్రసంగాల్లో అవమానకరమైన భాషను మాట్లాడవద్దని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గురువారం నేతలు ఉపయోగించే భాషపై కీలక సూచనలు చేసింది. దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను సాధ్యమైనంత వరకూ ఉపయోగించకుండా ఉండాలని స్పష్టం చేసింది. మూగ, పాగల్, సిర్ఫిరా, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను నేతలు వాడకుండా ఉండాలని హెచ్చరించింది. రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలు నిషేధించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సూచించింది.

ఇది అవమానకరమైన భాష కాబట్టి అన్ని పార్టీలు సహకరించాలని, తమ నేతలకు తగిన సూచనలు ఇవ్వాలని పేర్కొంది. రాజకీయ ప్రసంగాల్లో దివ్యాంగులకు న్యాయం, గౌరవం కల్పించాలని తెలిపింది. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు తమ రచనలు,కథనాలు ప్రచారంలో ఏదైనా బహిరంగ ప్రకటన లేదా ప్రసంగం సమయంలో దివ్యాంగులపై చెడు, అవమానకరమైన పదాలు ఉపయోగించకూడదు. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు ఏదైనా బహిరంగ ప్రసంగంలో, రాజకీయ ప్రచారంలో మానవ అసమర్థత సందర్భంలో దివ్యాంగులు, వైకల్యం ప్రతిబింబించే విధమైన పదాలు వాడకూడదన్నారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు వికలాంగుల వైకల్యానికి సంబంధించిన వ్యాఖ్యలను ఖచ్చితంగా నివారించాలన్నారు. అవి అభ్యంతరకరమైనవి, పక్షపాతాలను శాశ్వతం చేస్తున్నాయని పేర్కొంది.

ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలతో సహా అన్ని ప్రచార సామాగ్రిలో వికలాంగుల పట్ల అసహ్యకరమైన లేదా వివక్షతతో కూడిన భాషాపరంగా ఉన్న పదాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి రాజకీయ పార్టీ అంతర్గత సమీక్ష ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించింది. అన్ని రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో వైకల్యం, లింగ సున్నితమైన భాషను ఉపయోగిస్తాయని నిర్ధారించుకుంటున్నట్లు ప్రకటించాలని తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలు దివ్యాంగులను గౌరవిస్తున్నట్లు తమ పార్టీ వెబ్‌సైట్‌లో ప్రధానంగా ప్రచురించాలని ఈసీ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News