- Advertisement -
కీలకమైన మూడో వన్డేలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్టుకు 297 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 296 పరుగులు సాధించింది. సంజూశాంసన్(108) శతకంతో అదరగొట్టగా..తిలక్ వర్మ(52) అర్థశతకంతో రాణించాడు. రింకూ సింగ్(38) ఉన్నంతసేపు ధనాధన్ ఇన్నింగ్స్ అలరించాడు. ఓపెనర్ రజత్ పటీదార్(22), కెప్టెన్ కెఎల్ రాహుల్(21)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు.
- Advertisement -