Monday, December 23, 2024

తబ్లిగీ జమాత్ సంస్థను ప్రోత్సహిస్తే ఉగ్రవాదం పెంచినట్లే : రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో వికారాబాద్‌లో జరగనున్న తబ్లిగీ జమాత్ సమావేశాలకు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్, ఉబ్జెకిస్తాన్, తజికిస్తాన్, కజికిస్తాన్, రష్యా, సౌదీ అరేబియా సహా అనేక దేశాలలో ఈ సంస్థపై నిషేధం కొనసాగుతోందని అటువంటి తబ్లిగీ జమాత్‌కు ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేసిందని ప్రశ్నించారు.

తీవ్రవాద సిద్ధాంతం కలిగిన సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతోందని విమర్శించారు. గురువారం రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏం ఆశించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చూస్తున్నారో సిఎం చెప్పాలన్నారు. తబ్లిగీ జమాత్ చరిత్ర మీకు తెలియదా అని నిలదీశారు. గతంలో బైంసాలో జరిగిన సదస్సులో సందర్భంగా హింస చెలరేంగిందని, తబ్లిగీ జమాత్ సంస్థకు ప్రోత్సహిస్తే ఉగ్రవాదాన్ని పెంచినట్లు అవుతుందని మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News