Saturday, December 21, 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

మొత్తం ఆరురోజులు….26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు
సభలో ప్రసంగించిన 19 మంది ఎమ్మెల్యేలు

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 09వ తేదీన ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.

ఈ సభలో 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించగా ఈ సభలో రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. డిసెంబర్ 21వ తేదీ నాటికి నాటికి సభలో కాంగ్రెస్ 64 మంది, బిఆర్‌ఎస్ 39 మంది, బిజెపి 8 మంది, ఎంఐఎం 7, సిపిఐ ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి సమావేశం ఇది. డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం పనితీరు, ఖర్చులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News