Saturday, December 21, 2024

సాహితి ఇన్‌ఫ్రా ఆస్తులు సీజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సాహితి ఇన్ ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన స్థిరాస్తుల ను గురువారం ఇడి ఎటాచ్ చేసింది. సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటె డ్ మేనేజింగ్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణ, మా జీ డైరెక్టర్ పూర్ణచంద్రారావు, వారి కుటుంబ సభ్యులకు చెందిన రూ. 161.50 కోట్ల ఆస్తుల ను సీజ్ చేసింది. 2022 డిసెంబర్‌లో సాహితీ ఇన్‌ఫ్రా గ్రూప్ ఎండి లక్ష్మీనారాయణని హైద రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అమీన్‌పూర్‌లో ప్రీ లాంచ్ పేరుతో 2500 మంది కస్టమర్ల దగ్గర సాహితీ గ్రూప్ రూ.900 కోట్లు వసూలు చేసి వెంచర్‌ని స్టార్ట్ చేయలేదనే అభియోగా లున్నాయి. దీనిపై కస్టమర్ల ఫిర్యాదుతో పోలీ సులు కేసు నమోదు చేశారు. ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో 18శాతం వడ్డీతో డబ్బులు తిరిగిస్తా నని లక్ష్మీనారాయణ బాధితులు చెప్పారు. చె ప్పినట్లే ఆయన చెక్కులు ఇవ్వగా, ఆ చెక్కులు బౌన్స్ అవడంతో సిసిఎస్‌లో బాధితులు ఫిర్యా దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News