Saturday, December 21, 2024

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు గరువారం తీర్పు ను వెలువరించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. అక్టోబర్ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటి షన్ వేసింది. దీంతో, డిసెంబర్ 27న ఎన్ని కలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆ శాలు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలన్నీ ప్రచారాన్ని కూడా చేసుకుం టున్నాయి. ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుత ప్ర భుత్వం పిటిషన్ వేయడంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్ర భుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని, అధికారులు బిజీ గా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యం లో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదని అభిప్రాయపడ్డ హైకోర్టు ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News