ఉగ్రదాడిలో అమరులైన నలుగురు జవాన్లు
జమ్మూకశ్మీర్‌లో ఘటన
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌లో భద్రతా దళాలే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు జవార్లు అమరులయ్యారు. రాజౌరి పూంఛ్ ప్రాంతంలోని డేరాకీ గలీ ప్రాంతంగుండా వెళ్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురు జవార్లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.పూంచ్ జిల్లాలోని బుప్లియాజ్ సమీపంలో బుధవారం రాత్రినుంచి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం జవాన్లు రెండు వాహనాల్లో ఆ ప్రాంతానికి బయలుదేరారు. రాజౌరీరాణామండీసురన్ కోటే రహదారిపై సావ్ని ప్రాంతానికి చేరుకోగానే ఉగ్రవాదులు ఒక్కసారిగా వాహనాలపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. భద్రతా దళాలు సైతం ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపాయి. సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలతో పాటు అంబులెన్స్‌లను ఆ ప్రాంతానికి తరలించినట్లు అధికారులు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేయడం ఇది రెండో సారి. గత నెల రాజౌరి ప్రాంతంలోని కలాకోటె వద్ద భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు సహా అయిదుగురు జవాన్లు మృతి చెందారు.