Monday, December 23, 2024

14 నెలల చిన్నారికి కరోనా.. నీలోఫర్‌ వైద్యులు అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ నాంపల్లి ఆగాపురకు చెందిన 14 నెలల చిన్నారికి కరోనా మహామ్మారి సోకింది. చిన్నారికి కరోనా వచ్చినట్లు నీలోఫర్‌ వైద్యుల నిర్ధారణ చేశారు. నిమోనియాతో ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు వెద్యులు. చిన్నారికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయని వెల్లడించారు.

అటు భారత్ లో శుక్రవారం 640 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కేరళకు చెందిన ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరింది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 3,000కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసులలో ఆకస్మిక పెరుగుదల ​​జరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News