Saturday, November 23, 2024

రిపబ్లిక్ డేకు ముఖ్యఅతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

మాక్రాన్‌కు భారత్ ఆహ్వానం

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాని నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్మాన్యుల్ మాక్రాన్ హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక భారత గణంత్ర దినోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు పాల్గొనడం ఇది ఆరవసారి. మొదట అమెరికా అధ్యోఉడు జో బైడెన్‌ను గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించింది. అయితే జనవరిలో న్యూఢిల్లీ రావడంపై బైడెన్ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో అమెరికా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించాల్సిన కార్యక్రమం ఉండడం, అంతేగాక అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తుండడంతోపాటు హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా దృష్టిని సారించడం వంటి కారణాల వల్ల బైడెన్ భారత పర్యటన సాధ్యం కాలేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌ను భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించినట్లు వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఆహ్వానంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కాగా..రక్షణ, భద్రత, స్వచ్ఛ ఇంధనం, వాణిజ్య, పెట్టుబడి, నూతన సాంకేతిక పరిజ్ఞానం తదితర రంగాలలో భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాలకు ఫ్రెంచ్ అధ్యక్షుడిని భారత్ ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News