- Advertisement -
ట్రాన్స్ జెండర్ స్వయం శక్తిగా జీవనం సాగించేందుకు గాను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆర్ధిక సహాయం అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ముగ్గురు(3) ట్రాన్స్ జెండర్లు, ప్రేమ , చిట్టి మహతి, వాద్యత్ అఖిలేష్ రాజపూత్ లకు ఆర్ధిక పునరావస పథకం క్రింద ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెక్కులు అందజేశారు. ఈ నగదు మొత్తాన్ని స్వీకరించిన ట్రాన్స్ జెండర్లు తమ జీవనోపాధి కోసం ఉపయోగించుకొని తమ కాళ్ళమీద నిలబడి సమాజం లో ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి రాజేందర్ పాల్గొన్నారు.
- Advertisement -