Friday, November 22, 2024

‘2018’ చిత్రం ఆస్కార్ రేసు నుంచి అవుట్

- Advertisement -
- Advertisement -

2018 వరదల మలయాళ సిన్మాకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ : ఆస్కార్ అవార్డులు 2024 పోటీలో మలయాళ చిత్రం 2018 నిలదొక్కులేకపోయింది. 2018 కేరళ వరదల ఇతి వృత్తంతో ఈ 2018 ఎవరీఒన్ ఈజ్ హీరో’ చిత్రాన్ని భారతదేశం తరఫున ఆస్కార్ పోటీకి నామినేట్ చేశారు. ఈ సినిమాను జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆస్కార్ ఫీచర్ ఫిల్మ్‌విభాగంలో పోటీకి చేరినా , ఇందులో అవార్డుల పోటీ క్రమపు షార్ట్‌లిస్టు ఫైనల్ 15 చిత్రాల జాబితాలో చోటుచేసుకోలేకపోయింది. దీనితో ఈసారి ఆస్కార్ చలన చిత్రా పురస్కారాల పందెంలో నుంచి ఔట్ అయింది. గతంలో 2023 ఆస్కార్ బరిలో రాజమౌళి సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. డాక్యుమెంటరీ జాబితాలో ది ఎలిఫెంట్ విస్పర్స్ నిలిచాయి. దీనితో ఈసారి కూడా భారతీయ సినిమాలపై ఆసక్తి నెలకొంది.

తెలుగు చిత్రాల బలగం, దసరా సినిమాలు పోటీ ప్రవేశ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. షార్ట్‌లిస్టులో 2018 ..సినిమా చోటుచేసుకోలేకపోయిందనే విషయాన్ని ఆస్కార్ నిర్వాహకులైన అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్ (ఆంపాస్ ) ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఏటి ఆస్కార్ బరిలో ప్రధాన పోటీ జాబితాలో జోనాథన్ గ్లేజర్ చారిత్రక ఇతివృత్త సినిమా ది జోన్ ఆఫ్ ఇంటరెస్టు (డెన్మార్క్), ది ప్రామిస్‌డ్ ల్యాండ్ (డెన్మార్క్) , జపాన్ సినిమా పర్‌ఫెక్ట్ డేస్ నిలిచాయి. ఇక ఉత్తమ డాక్యుమెంటరీల జాబితాలో భారతదేశం తరఫున టు కిల్ ఎ టైగర్ షార్ట్‌లిస్టు అర్హత పొందింది. ఈ డాక్యుమెంటరీని జార్ఖండ్‌లో జరిగిన ఓ సామూహిక అత్యాచారం నేపథ్యంలో రూపొందించారు. దీనికి టొరంటోకు చెందిన డాక్యుమెంటరీ నిర్మాత నిషా పహుజా దర్శకులు. ఇప్పుడు జరిగే 96వ ఆస్కార్ అవార్డు పోటీలో విజేత ఖరారు 2024 మార్చి 10న లాస్ ఏంజిలెస్‌లో జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News