- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం పది రోజులుగా రాష్ట్రం లోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడి పోతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలంటే చలికి జనం వణికి పోతున్నారు. ఉదయం మంచు కారణంగా రోడ్లు కనబడని పరిస్థితి నెలకొంది. దీంతో తొమ్మిది గంటల తర్వాత కాని వాహనాలు రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇక, పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి పోతుండటంతో చలి తీవ్రస్థాయికి చేరుకుంది. ఏకంగా 6.6 డిగ్రీల సెల్సీయస్ కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వణికి పోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మంచు కురువడం సాధారణం అయినప్పటికీ శీతల గాలులు ఈశాన్యం నుంచి బలంగా వీస్తున్నాయి.
- Advertisement -