Monday, November 25, 2024

ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విమానంలో 300 మంది భారతీయులు ..

- Advertisement -
- Advertisement -

వాట్రి : నికరాగువాకు వెళ్లుతున్న ఓ విమానాన్ని ఫ్రాన్స్‌లో నిలిపివేశారు. ఇందులో 300 మందికి పైగా భారతీయులు కూడా ఉన్నారు. మానవ అక్రమరవాణా జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ఈ విమానాన్ని దిగ్బంధించినట్లు ఫ్రాన్స్ అధికారులు శుక్రవారం తెలిపారు. కొందరిని ఈ విమానంలో అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే విమానాన్ని నిలిపివేసినట్లు పారిస్‌లోని అధికారులు వార్తాసంస్థకు తెలిపారు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ నుంచి ఈ విమానం బయలుదేరింది. కాగా ఇందులో 300 మందికి పైగా భారతీయులు ఉన్నారనే సమాచారం కీలకమైంది.

ఫ్రాన్స్ జాతీయ స్థాయి వ్యవస్థీకృత నేరాల అదుపుసంస్థ విభాగం జునాల్కో ఇప్పుడు ఈ మానవ అక్రమ రవాణా అంశంపై దర్యాప్తు చేపట్టింది. గురువారం రాత్రి విమానాన్ని నిలిపివేశారు. రొమేనియా ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్వహించే ఈ ఎ 340 విమానం ఇప్పుడు ఫ్రాన్స్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్టు టార్మక్‌లో నిలిపి ఉంచారు. ప్రయాణికుల వివరాలను తెలుసుకుంటున్నారు. భారతీయ ప్రయాణికులు కొందరు సెంట్రల్ అమెరికా దేశంలోకి ముందుగా చేరుకుని తరువాత అమెరికా లేదా కెనడాలకు అక్రమంగా చేరుకోవాలని బయలుదేరినట్లు భావిస్తున్నామని కొన్ని వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News