మన తెలంగాణ/హైదరాబాద్: ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే సామెతను కేంద్ర ప్రభుత్వం బాగా వంటపట్టించుకొన్నట్లుగా ఉందని, అందుకే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న స మస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వే స్తూ వచ్చిందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నా యి. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పదవీ లు చేపట్టిన రెండు వారాలకే రెండు తెలుగు రా ష్ట్రాల మధ్య నెలకొన్న ఆస్తులు, పంపకాల వివాదాలపై దృష్టి సారించడంతో ప్రభుత్వవర్గాల్లో స రికొత్త ఆశలు చిగురించాయి. అయితే కేంద్రం లో ఉన్న బిజెపి ప్రభుత్వం తె లుగు రాష్ట్రాల సమస్యలు, వి వాదాలను పరిష్కరించకుం డా ఏకంగా తొమ్మిది సంవత్సరాలు నాన్చుతూ వచ్చిందని, అయితే ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, ప్రధాని నరేంద్రమోడీకి మధ్య వ్య క్తిగతంగా సత్సంబంధాలే ఉన్నాయని, పూర్వ యాలతో తెలుగు రాష్ట్రాల మ ధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి చొ రవ చూపించాలని ప్రధానిని కలిసిన సమయం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరే అవకాశాలు కూడా ఉన్నాయని కొంద రు సీనియర్ అధికారులు వివరించారు.
అయితే ఒకవైపు సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతోందని, కనీసం ఇలాంటి పరిస్థితుల్లోనైనా ప్రధానమంత్రి తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెడతారా.. లేదా..? అనే చర్చ జరుగుతోంది. గడచిన తొమ్మిదేళ్లల్లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన రెండుసార్లు తెలుగు రాష్ట్రాల అధికారులతో స మావేశాలు, చర్చలు జరిగాయని, కానీ ఎలాంటి సత్ఫలితాలు రాలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వంముఖ్యంగా 11 రకాల ప్రధాన అంశాలను పరిష్కరించి రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతోందని ఆ అధికారులు వివరించారు. ముఖ్యంగా 9వ షెడ్యూలులోని 91 సంస్థల విభజన విషయంలో డా. షీలాభిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసులను కూడా అమలు చేయించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని, వివాదాల పరిష్కారానికి నియమించిన సబ్-కమిటీ మూడు దశల్లో ఈ సంస్థలను విభజించాలని సిఫారసు చేసిందని, అందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలున్నాయని అధికారులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎపి ప్రభుత్వం మాత్రం షీలాభిడే సిఫారసులను యథావిధిగా ఆమోదించిందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలన్నీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ఆ కేసులు తేలాల్సి ఉందని వివరించారు. అంతేగాక డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డిఐఎల్‌ఎల్-), ఎపి డైరీ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌ల వివాదాల పరిష్కారంపై తెలంగాణ ఇచ్చిన విన్నపాలను కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపించారు.
అదే విధంగా ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ వివాదం విషయాన్ని కూడా పరిశీలించాలని హోంశాఖ అధికారులను అజయ్‌భల్లా ఆదేశించి ఇప్పటికి రెండేళ్లు అవుతోందని, కానీ ఇప్పటి వరకూ ఆ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని వివరించారు. 10వ షెడ్యూలులోని 142 ఇన్‌స్టిట్యూషన్ల విషయంలో కూడా ఎలాంటి ముందడుగు పడలేదని, తెలుగు అకాడము విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగించేవిగా ఉన్నాయని, అందుకే తీవ్రంగా వ్యతిరేకించామని అధికారులు తెలిపారు. ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్), ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఎపిహెచ్‌ఎంఇఎల్)లు పూర్తిగా తెలంగాణకు చెందిన ఆస్తులని, ఇందులో విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధంలేదని, ఎపిహెచ్‌ఎంఇఎల్ సంస్థ కేవలం సింగరేణికి అనుబంధ సంస్థ మాత్రమేనని, అందుకే సింగరేణిలో వాటాలు కోరుతున్న ఎపి ప్రయత్నాలను తెలంగాణ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారని వివరించారు. సివిల్ సప్లయీస్ కార్పోరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్లో వివాదాస్పదమైన 354 కోట్ల రూపాయల నిధుల సబ్సిడీలో తెలంగాణ రాష్ట్ర వాటా తేలే వరకూ ఆ నిధులను విడుదల చేసేదిలేదని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే తెగేసి చెప్పింది. విభజన చట్టంలో లేనటువంటి 12 ఇన్‌స్టిట్యూట్‌లను విభజించడానికి ఎపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు గతంలోనే తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయశాఖ సలహా తీసుకోనున్నట్లుగా గత సమావేశాల్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ కూడా ఇచ్చారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు, బ్యాంక్ బ్యాలెన్స్‌లపైన కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-) సలహాలు తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంగీకరించినప్పటికీ ఇప్పటి వరకూ ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయించాలని గతంలో రాష్ట్ర అధికారులు కోరారని, విడుదల చేస్తామని చెప్పి కూడా ఏడాది గడిచిందని, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56లను సవరణలను చేయాలని ఎపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తెలంగాణ రాష్ట్రం మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, రాష్ట్రాల విభజన జరిగిన ఎనిమిదేళ్ళ (2022 సెప్టెంబర్ నాటికి) తర్వాత చట్టంలో సవరణలు చేయడం అర్ధరహితమని, ఇలా చేస్తే ఆ చట్టానికి హేతుబద్దత ఉండదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతోంది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి నిర్మాణానికి 29 వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని సిఫారసు చేసిందని ఎపి అధికారులు కేంద్రానికి పదేపదే గుర్తు చేస్తున్నారని వివరించారు.