Monday, December 23, 2024

‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసిన ‘సలార్’..

- Advertisement -
- Advertisement -

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ వస్తూళ్లను రాబడుతోంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ‘సలార్’.. నైజాం మార్కెట్ లో దుమ్ములేపుతోంది. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బద్దలు కొట్టింది. హైదరాబాద్ రీజన్ లో అడ్వాన్స్ గ్రాస్ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ ని సలార్ బ్రేక్ చేసింది. రూ.12 కోట్లకు పైగా రాబాట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. నైజాం ఏరియాలో సలార్ 22.55 కోట్లు వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే 32 కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది.

‘సలార్’ మూవీ తొలి రోజు ఇండియన్ భాక్సాఫీస్ వద్ద 178.7 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో 2023లో ఓపెనింగ్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా ‘సలార్’ నిలిచింది. ఒకరోజు ముందుగా డిసెంబర్ 21న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ ‘డంకీ’ విడుదల కావడంతో ‘సలార్’ కలెక్షన్స్ పై కొంత ప్రభావం పడింది. లేకపోతో ఈ మూవీ తొలి రోజే అదిరిపోయే వసూళ్లను రాబట్టేదని విశ్లేషకులు అంటున్నారు. తొలి రోజు అత్యధికంగా వసూల్ చేసిన సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ తొలి స్థానంలో ఉండగా, ‘బాహుబలి 2’ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ‘సలార్’ మూవీ.. తర్వాత ‘కేజిఎఫ్ 2’, ‘లియో’, ‘ఆదిపురుష్’ సినిమాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News