Sunday, November 24, 2024

అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్త కోటికి దర్శనమివ్వగా అర్చకులు 108 ఒత్తులతో హారతి పట్టారు. అనంతరం ఉత్సవ మూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు. జై శ్రీరామ్ అంటూ భక్తుల జయజయ ధ్వానాల మధ్య గరుఢ వాహన రూపుడై శ్రీరామచంద్రుడు శ్రీ మహా విష్ణువు అలంకారంలో కనిపించారు. వేద పండితులు విశేష ఆరాధన, శ్రీ రామ పదాక్షరీమంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన, చతుర్వేదాలు, గరుఢ ప్రబంధాలు, ఇతి హాసాలు, శరణాగతి, గజ్జ గరుడ గండం, భక్త రామదాసు రచించిన దాశరథి శతకాన్ని పఠించారు. అనాధిగా వస్తున్న ఆచార సంప్రదాయాల ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్ మూల వర్లకు స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకుంఠ రాముడు తిరువీధి సేవకు బయలుదేరి వెళ్లారు. చలువ చప్పర గరుఢ వాహనంపై పెరియాల్వార్, నమ్మల్వార్ శ్రీరాముడు, మరో వాహనంపై అందకమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణ స్వామి, గజ వాహనంపై సీతమ్మవారు మాడ వీధుల్లో విహారం చేశారు.

అనంతరం వేద పం డితులు ముక్కోటి విశిష్టతను వివరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిఐపి, విఐపి, ఇతర సెక్టార్లో భక్తులు ఈ వేడుకలను తిలకించిన భక్తులు పులకించిపోయారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ ప్రియాంక అల నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు అధికార యం త్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రతీ సెక్టార్‌లో స్వయంగా పర్యవేక్షిస్తూ జిల్లా, లైజన్ అధికారులను నియమించారు. ఎస్‌పి. డాక్టర్ వినీత్ బందోబస్తు ఏర్పా ట్లు పర్యవేక్షించారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని, శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఖమ్మం కలెక్టర్ గౌతమ్ దంపతులు, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసుదన్ రాజు, ఏఎస్‌పి పంకజ్ పరితోష్, దేవస్థానం ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవాల విజయవంతంపై కలెక్టర్ ధన్యవాదాలు
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అధికారులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు , సిబ్బంది సమన్వయంతో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన తెప్పోత్సవం, ఉత్తర ద్వారా దర్శనం అద్భుతంగా నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతీ ఒక్కరికి, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News