Saturday, November 23, 2024

అయోధ్య నుంచి తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రయాణికులకు, భక్తులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు అయోధ్య సంసిద్ధమవుతోంది. అతి త్వరలో మొట్టమొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అయోధ్య నుంచి ప్రారంభం కానున్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 30న అయోధ్య చేరుకుని రెండు అమృత్ భారత్ రైళ్లతోపాటు ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారని వర్గాలు శనివారం తెలిపాయి. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. అయోధ్యలో భారీ కార్యక్రమం జరగనున్నదని, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 30న అయోధ్య నుంచి మొట్టమొదటి అమృత్ భారత్ రైలును ప్రారంభిస్తారని ఒక సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమవుతాయని, అందులో ఒకటి అయోధ్య నుంచి ఉంటుందని ఆయన తెలిపారు.

ఒకఅమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అయోధ్య నుంచి దర్భంగ మధ్య నడుస్తుందని ఆయన చెప్పారు. రెండవ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ దక్షణ భారతదేశంలో ఉంటుదని ఆయన చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి చెబుతూ అయోధ్య నుంచి ఆనంద్ విహార్(ఢిల్లీ)కు ఒకటి నడుస్తుందని, మిగిలినవి వౌష్ణోదేవి నుంచి న్యూఢిల్లీ, జాల్నా నుంచి ముంబైకి, కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు, అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి, మంగళూరు నుంచి మడ్గావ్‌కు ఉంటాయని ఆయన తెలిపారు. ఆ అధికారి తెలిపిన వివరాల ప్రకారం నాన్ ఎసి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు 22 బోగీలు ఉంటాయి. ఇందులో 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. గార్డు కంపార్ట్‌మెంట్లలో విడిగా కోచ్‌లు ఉంటాయి. మహిళలు, దివ్యాంగులైన ప్రయాణికులకు సీటింగ్ ఉంటుంది. సగటున గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు నడుస్తాయి. ట్రాక్ పరిస్థితిని బట్టి వేగంలో మార్పులు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News