వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి 2020 జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలపై తిరుగుబాటు చేసినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయమై వెంటనే విచారణ చేపట్టాలనిఅ కోరుతూ ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అయితే సుప్రీంకోర్టు పిటిషన్‌ను తిరస్కరించడం 2024లో మళ్లీ వైట్ హౌస్‌కు ఎన్నిక కావాలని ఆరాటపడుతున్న ట్రంప్‌కు భారీ ఉపశమనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తనపై నమోదైన క్రిమనల్ కేసులు తన ఎన్నికకు అవరోధంగా మారతాయని ఆందోళన చెందుతున్న టంప్ వాటి విచారణ సాధ్యమైనంత ఆలస్యం కావాలని కోరుకుంటున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మార్చి 4న సుప్రీంకోర్టులో ఈ కేసుపై విచారణ జరగనున్నది. మాజీ అధ్యక్షుడిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదని ట్రంప వాదిస్తున్నారు. తన చర్యలు అధికారిక విధుల పరిధిలోకి వస్తాయని ఆయన చెబుతున్నారు.