Sunday, January 19, 2025

నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమ లు, పాలనా యంత్రాంగం గ్రామ స్థాయికి తీసుకె ళ్లే ప్రజా పాలన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా భాద్యత లు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో ఆదివారం డా.బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వ లోపాలను అరికట్టడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి అ త్యంత ప్రాముఖ్యతనిస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి నే తృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే మహాత్మ జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడాని కి చేపట్టాల్సిన  కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్ట ర్ల సమావేశంలో ప్రకటించనున్నారు.

దీనితోపాటు, ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకు ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగా న్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకై ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పర్చడం, జవాబుదారిగా ఉండేందుకు ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి. ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, కార్పొరేటర్,కౌన్సిలర్‌లను ఆహ్వానించడంతో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News