- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 67,906 మంది భక్తులు దర్శించుకోగా 28,492 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానాన్ని అర్చకులు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి, చక్రతాళ్లార్‌కి తిరుమంజనం చేశారు. చక్రతాళ్వార్‌కు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. చక్రస్నానం ఉత్సవంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -