- Advertisement -
రాంఛీ: 14 ఏళ్ల బాలుడు బర్త్ డే వేడుకలు జరుపుకుంటుండగా అతడిని క్లాస్‌మెట్ కత్తి పొడిచి చంపిన సంఘటన ఝార్ఖండ్‌లోని హజరిబాగ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలుడు(14) తన స్నేహితులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకుంటుండగా క్లాస్‌మెట్ అతడి కడపులో కత్తితో పలుమార్లు పొడవడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని షేఖ్ భిఖారి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడితో పాటు నలుగురు బాలుర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -