Monday, December 23, 2024

ప్రముఖ హాస్య నటుడి మృతి

- Advertisement -
- Advertisement -

ప్రముఖ తమిళ హాస్య నటుడు బోండా మణి కన్నుమూశారు. ఆయన వయసు 60 ఏళ్లు. 250కి పైగా సినిమాల్లో నటించిన మణి, మూడు దశాబ్దాలపాటు సినీ ప్రేక్షకులను తన విలక్షణమైన కామెడీతో అలరించారు.

మణి కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన శనివారం రాత్రి తన ఇంట్లో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే క్రోంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన కన్నుమూశారని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భాగ్యరాజా “పవున్ను పవునుధన్” సినిమాతో అరంగేట్రం చేసిన బోండ మణి ‘సుందర ట్రావెల్స్’, ‘విన్నర్’, ‘వేలాయుధం’, ‘మరుదమలై’, ‘పొంగలో పొంగల్’, ‘పొన్విలంగు’ వంటి హిట్ సినిమాల్లో నటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News