Sunday, January 19, 2025

పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు దిశగా ముందుకు సాగుతోంది. సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు పోయేందుకు కసరత్తు చేస్తోంది. పాలన పారదర్శకతకు రాష్ట్రప్రభుత్వం పెద్దపేట వేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ప్రజా పాలన, ఆరు గ్యారెంటీల అమలు, క్షేత్రస్థాయి అంశాలపై చర్చించారు. జిల్లా స్థాయి పాలనపై సిఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 28వ తేదీ నుండి 26వరకు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. జనవరి నెలాఖరు వరకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరు గ్యారంటీలు అమలు చేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి.

ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోతే టార్గెట్‌ రీచ్‌ కాలేమన్నారు. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదే అన్నారు. నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఉండి సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News