Monday, December 23, 2024

చాదర్‌ఘాట్‌ పోలీసుల నిర్లక్ష్యం.. మృతదేహం చూసి కన్నీరుమున్నీరైన కుటుంబం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈనెల 7 అర్ధరాత్రి శ్రవణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో శ్రవణ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. కానీ ఈ విషయాన్ని శ్రావణ్‌ తల్లిదండ్రులకు చెప్పలేదు. శ్రావణ్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు 20 రోజులుగా చాదర్‌ఘాట్‌ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. శ్రావణ్‌ ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న విషయాన్ని కూడా పోలీసులు సీక్రెట్‌గా ఉంచారు. మార్చురీల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు చివరికి ఉస్మానియా ఆస్పత్రిలో కుమారుడి మృతదేహాన్ని తండ్రి గుర్తించారు. మార్చురీలో మృతదేహం చూసి కుటుంబం కన్నీరుమున్నీరైంది. ప్రమాదం, చికిత్స, మరణాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News