Thursday, December 26, 2024

మృత్యువు నుంచి బిడ్డలను కాపాడుకున్న అమ్మ

- Advertisement -
- Advertisement -

పాట్నా: అంగుళం దూరంలో పొంచి ఉన్న మృత్యువు నుంచి ఇద్దరి పిల్లలను అమ్మ కాపాడుకోగలిగింది. బీహార్‌లో బార్హ్ రైల్వేస్టేషన్‌లో శనివారం ఈ సంఘటన అనేక మందికి విస్మయం కలిగించింది. బీహార్ లోని బెగుసరాయ్‌కు చెందిన ఓ మహిళ కుటుంబంతో ఢిల్లీకి వెళ్లడానికి బార్హ్ రైల్వేస్టేషన్‌లో విక్రమ శిలా ఎక్స్‌ప్రెస్ కోసం నిరీక్షిస్తోంది. ఇంతలో రైలు వచ్చేసరికి జనం ఎగబడ్డారు. ఆ తోపులాటలో ప్రమాదవశాత్తు తన ఇద్దరి చిన్నారులతో ఆమె పట్టాలపై పడిపోయింది.

ఇంతలో రైలు కదిలిపోయినా ఆమె భయపడకుండా తనదగ్గరకు పిల్లలను లాక్కొని వారిపై పడుకుంది. అంగుళం దూరంలో మృత్యువు పొంచి ఉండగా తప్పించుకోగలిగింది. ఆమెకు అత్యంత సమీపంగా రైలు దూసుకెళ్లింది. రైలు వెళ్లగానే అక్కడున్నవారు పట్టాల పైకి దూకి తల్లీబిడ్డలను పైకి తీశారు. స్వల్పగాయాల పాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News