- Advertisement -
రేగోండ : రేగోండ మండలంలోని మహత్మజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు రేగోండ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ హస్టల్లో పిల్లలకు కనీస వసతులు లేవని కనీసం త్రాగడానికి మంచీనీరు లేదన్నారు.మరుగుదోడ్లు శుభ్రంగా లేక పిల్లల అవస్థలు పడుతున్నారని , పిల్లలను పట్టించుకోకపోగా పోంతనలేని సమాధానం చేపుతున్నారని అన్నారు.
500 మంది పిల్లలకు నాలుగు బాత్‌రూంలు ఉన్నట్లు , వాటిని శుభ్రపరచకపోవడం వలన వాటినుండి దుర్వాసన వస్తున్నట్లు దీని వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లు పెరెంట్స్ కమిటి మెంబర్‌లు ఆరోపించారు.పిల్లలకు నాణ్యమైన భోజనం అందించకపోవడం వలన పిల్లలు ఆనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యయురాలుపై చర్య తీసుకోవాలని రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
- Advertisement -