Saturday, December 21, 2024

ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 55వ డివిజన్, భీమారంలో శ్రీచైతన్య తెలంగాణ జూనియర్ కళాశాల చైర్మన్ బూర సురేందర్‌గౌడ్‌ ను ఆదివారం కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ ఎసిపి కిరణ్‌కుమార్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం, బాలాజీనగర్‌కు చెందిన ఒక విద్యార్థిని భీమారంలోని శ్రీచైతన్య తెలంగాణ జూనియర్ కళాశాలలో ఎంపిసి సెకండ్ ఇయర్ చదువుతోంది. కళాశాల చైర్మన్ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో హాస్టల్‌లో ఉన్న ఆ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడని, తన కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేశాడని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థిని అక్కడి నుంచి వెళ్లి సహచర విద్యార్థులకు జరిగిన విషయం గురించి తెలిపిందని అన్నారు.

వారు సదరు విద్యార్థిని తల్లిదండ్రులకు శనివారం ఉదయం ఫోన్ ద్వారా సమాచారం అందించారని తెలిపారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు హుటాహుటిన కళాశాల వద్దకు చేరుకొని చైర్మన్‌తో ఈ విషయం మాట్లాడేలోపే ఆయన అక్కడ నుంచి పరారయ్యాడని తెలిపారు. వరంగల్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు నిందితుడు బూర సురేందర్‌గౌడ్‌ని పక్కా సమాచారం మేరకు కాకతీయ యూనివర్సిటీ పోలీసుల సహకారంతో టాస్క్‌ఫోర్స్ నిఘా విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు ఎసిపి కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో కెయు సిఐ ఎ. అబ్బయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News