Sunday, January 19, 2025

సలార్ పార్ట్- 2 ఇంకా బాగుంటుంది: ప్రభాస్

- Advertisement -
- Advertisement -

సలార్ తో రెబెల్ స్టార్ ప్రభాస్ మరో సూపర్ హిట్ ను అందుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియాలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా ఆయన విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ గురించి, రాబోయే సినిమాల గురించి అనేక విశేషాలు పంచుకున్నారు.

సలార్ మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని రెబల్ స్టార్ ప్రభాస్ అన్నారు. ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడితో కలసి పనిచేయడం తన అదృష్టమని ఆయన  చెప్పారు. బాహుబలి సక్సెస్ తర్వాత, తాను ఒప్పుకున్న ప్రతి సినిమాలోనూ ఎంతో  కష్టపడి పనిచేశానని చెప్పారు. విభిన్నమైన, ఛాలెంజింగ్ గా ఉండే ఇతి వృత్తాలను ఎంపిక చేసుకున్నానని ప్రభాస్ తెలిపారు.

సలార్ మూవీలో నటించాలని ఎందుకు అనిపించిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ గా ఉందనీ, ప్రశాంత్ నీల్ కథ చెప్పిన విధానం కూడా అద్భుతంగా ఉందని చెప్పారు.

రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పనిచేయడం ఎంతో బాగుందన్నారు. నాగ్ అశ్విన్, సందీప్ వంగాలతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. నాగ్ అశ్వన్ దర్శకత్వంలో కల్కి 2998ఏడి సినిమాలోనూ, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలోనూ నటించేందుకు ప్రభాస్ అంగీకరించిన సంగతి తెలిసిందే.

భారతీయ సినిమా ఇప్పుడు ప్రాంతీయ సరిహద్దులను దాటి పురోగతి సాధిస్తోందనీ, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ల పరిధిని దాటి భారతీయ సినిమాగా గుర్తింపు పొందుతోందనీ, విభిన్నమైన కథాంశాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోందని ప్రభాస్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News