మనతెలంగాణ/హైదరాబాద్ : పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా ఏర్పడుతోంది. దీనివల్ల వాహనదారులే కుండా విమాన రాకపోకలకు బ్బందులు ఏర్పడ్డాయి. తాజాగా హైదరాబాద్‌లో వాతావరణ దృష్ట్యా శంషాబాద్‌లో పొగమంచు కారణంగా, ఎయిర్‌పోర్టు రావాల్సిన 30 విమానాలను అధికారులు దారి మళ్ల్లీంచారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సిన 3 విమానాలు గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. చండీగఢ్, గోవా, తిరువనంతపురం నుంచి ఈ మూడు వచ్చాయి. అదే విధంగా బెంగళూరు- హైదరాబాద్ విమానాన్ని తిరిగి బెంగళూరుకు పంపారు. మరోవైపు ముంబయి- టు హైదరాబాద్ విమానం తిరిగి ముంబయికి పంపించారు. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు శంషాబాద్ అధికారులు మళ్ల్లీస్తున్నారు.
ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ అలయన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను అధికారులు మళ్ల్లీంచారు. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని విమానయాన అధికారులు చెబుతున్నారు. మరోవైపు దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయినా వాతావరణం పొగ మంచుతో కప్పుకొని ఉంటోంది. పొగమంచుతో ప్రజలు బయటకు రావా లంటే జంకుతున్నారు. రోడ్లన్నీ పొగతో కనిపించక వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.